Thursday, January 23, 2025

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించిన హెచ్‌ఎండిఎ

- Advertisement -
- Advertisement -

డ్రా ద్వారా మొత్తం 923 మంది ఎంపిక

మనతెలంగాణ/హైదరాబాద్:  బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపును లబ్ధిదారులకు హెచ్‌ఎండిఏ విజయవంతంగా అందచేసింది. బండ్లగూడలో 804 మందికి, పోచారంలో 119 మంది లబ్ధిదారులకు మొత్తం 923 మందికి ఈ ప్లాట్లను కేటాయించింది. దీనికి సంబంధించి 14వ తేదీన డ్రాను నిర్వహించి లబ్ధిదారులను హెచ్‌ఎండిఏ ఎంపిక చేసింది. అయితే డ్రాలో పాల్గొనడానికి 1393 మంది డిడిల రూపంలో టోకెన్ అడ్వాన్సును చెల్లించగా అందులో నుంచి 923 మంది లబ్ధిదారులను ఎంపికచేసి వారికి ప్లాట్లను అప్పగించింది.

బండ్లగూడలోని 804 ప్లాట్లు…

బండ్లగూడలోని 3 BHK (డీలక్స్) ప్లాట్లను 162 మందికి, 3 BHK ప్లాట్లు 160 మందికి, 2 BHK ప్లాట్లు 377 మందికి, 1 BHK ప్లాట్లు 80 మందికి, 1 BHK సీనియర్ సిటీజన్ ప్లాట్లు 25 మందికి మొత్తం 804 ప్లాట్లను కేటాయించింది.

పోచారంలో 119 మందికి….

పోచారంలోని 3 BHK (డీలక్స్) ప్లాట్లను 44 మందికి, 3 BHK ప్లాట్లు 17 మందికి, 2 BHK ప్లాట్లు 36 మందికి, 1 BHK ప్లాట్లు 22 మంది లబ్ధిదారులకు హెచ్‌ఎండిఏ కేటాయించింది. అయితే లబ్ధిదారుల జాబితాను హెచ్‌ఎండిఏ (www.hmda.gov.in) వెబ్‌సైట్‌తో పాటు రాజీవ్ స్వగృహ (www.swagruha.telangana.gov.in) వెబ్‌సైట్‌లో పెట్టామని అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News