Monday, December 23, 2024

రాజీవ్ స్వగృహ ఇళ్లు, స్థలాల కొనుగోళ్లకు భారీగా స్పందన

- Advertisement -
- Advertisement -

రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజల ఆసక్తి

మనతెలంగాణ/హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇళ్లు, స్థలాలను కొనుగోళ్లు చేయడానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఇళ్ల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా ఐదు జిల్లాల్లో స్వగృహ ఖాళీ ప్లాట్ల విక్రయాలకు కూడా ప్రభుత్వం చేపట్టబోతోంది. నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని స్వగృహ భూములను అమ్మేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఈ భూములను ముందుగా పరిశీలించుకోవచ్చని ప్రభుత్వం సూచించడంతో వాటిని చూడడానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజీవ్ స్వగృహ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో ఉన్న స్వగృహ ఇళ్లను లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించేందుకు రిజిస్ట్రేషన్లు జోరుగా నమోదవుతున్నాయి. ఈ విక్రయాల్లో భాగంగా బండ్లగూడ, పోచారంలో మోడల్ టౌన్‌షిప్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతిరోజూ 300 మంది వరకు సందర్శిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆదివారం వరకు 11,500 వేల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.1.09 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చేనెల 14 వరకు ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా, రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చేనెల 14 తర్వాత వీటిని లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

Rajiv swagruha bandlaguda flats for sale

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News