Thursday, January 23, 2025

రేపటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

బండ్లగూడ, పోచారంలోని ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ
వచ్చే నెల 22వ తేదీన లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

Rajiv swagruha flats applications take tomorrow

మనతెలంగాణ/హైదరాబాద్:  రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. బండ్లగూడ, పోచారంలోని ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. బండ్లగూడలో 419 ఫినిష్ ప్లాట్లకు (చదరపు అడుగు ధర రూ.3 వేలు)గా, అందులోనే 1,082 సెమీ ఫినిష్డ్ ప్లాట్ల (చ.అ. ధర రూ.2,750లుగా), పోచారంలో 1,328 ఫినిష్డ్ ప్లాట్లకు చ.అ. ధర రూ.2,500లుగా, అదే చోట 142 సెమీ ఫినిష్డ్ ప్లాట్లకు చ.అ.ధర రూ.2,250గా ధరను నిర్ణయించారు.నేటి నుంచి జూన్ 14వరకు సాయంత్ర 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మీ సేవ పోర్టల్, స్వగృహ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000 (నాన్ రిఫండబుల్)గా నిర్ణయించారు. ప్లాట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో దీనిని అమలు చేయనున్నారు. అర్హులైన వారికి బ్యాంక్‌లోన్ సౌకర్యం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22వ తేదీన ప్లాట్లను కేటాయించనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు….

ఈ ఇళ్లను సందర్శించాలనుకునే వారు 12.05.2022 నుంచి 14.06.2022 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల ఎప్పుడైనా సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. బండ్లగూడకు సంబంధించి ఓరియంటేషన్ మీటింగ్ 29.05.2022 రోజు ఉదయం 11 గంటలకు, పోచారం మీటింగ్ 05.06.2022, ఉదయం 11 గంటలకు ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మీసేవ ts.meeseva.telangana.gov.in, swagruha.telangana.gov.in (తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్) వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. పోచారంలో ఉన్న సద్భావనా టౌన్‌షిప్ నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి 10 కి.మీల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 15 కి.మీలు, ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉంటుంది. బండ్లగూడ సహభావనా టౌన్‌షిప్ నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి 5 కి.మీల దూరంలో, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 10 కి.మీలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్టు నుంచి 19 కి.మీల దూరంలో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News