Wednesday, March 26, 2025

రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు జారీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఆర్థికంగా వె నుకబడిన వర్గాల (ఇబిసి) యువతకు రా జీవ్ యువ వికాసం పథకం కింద స్వ యం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చే సింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ని నిరుద్యోగ యువతకు రూ.4 లక్షల వ రకు ప్రభుత్వం రుణాలు ఇవ్వనున్నది. రూ.6వేల కోట్లతో రాజీవ్ యువ వికా సం పథకం ప్రారంభం కాగా.. ఈనెల 17వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ కు ఏప్రిల్ 5 చివరి తేదీ. ఈ పథకం ద్వా రా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. చిరు వ్యా పారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్ర త్యేకంగా రూ.50 వేల రుణాన్ని అందిస్తుంది. వీరు ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పని లేదు. అలాంటి వ్యాపారులకు నూరుశాతం  రాయితీతో రుణాలను మంజూరు చేయనున్నది. అలాగే మైనర్ ఇరిగేషన్‌కు 100 శాతం రాయితీతో ప్రభుత్వం రుణాలు ఇవ్వనున్నది. అలాగే రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10 శాతం) రాయితీ ఉంటుంది. రూ. లక్షల నుంచి రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20 శాతం) రాయితీ, రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే (70 శాతం) రాయితీ ఉంటుంది.
వీరు అర్హులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 వార్షికాదాయం, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్న వారు అర్హులు. నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21 నుంచి -55 ఏండ్ల లోపు వయసు గల వారు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 60 ఏళ్ల వరకు వయసు ఉన్నవారు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ దృవీకరణ పత్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, రవాణా రంగానికి చెందినవారికి డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ రంగ పథకాలకు పట్టాదార్ పాసు పుస్తకం, వికలాంగులకు సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటో ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి కింద ఐదేళ్లలో ఒక కుటుంబానికి ఒక పథకం మాత్రమే లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో ఎంపిడిఒ కార్యాలయంలోని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలలో, పట్ణణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ కార్యాలయాలలో డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం, అవసరమైన పత్రాలు సమర్పించాలి.

రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు

రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం రాయితీ
రూ.లక్ష రుణం తీసుకుంటే 90 వేలు (10 శాతం) రాయితీ
రూ.2 లక్షల రుణం తీసుకుంటే రూ.60 వేలు (20 శాతం) రాయితీ
రూ.4 లక్షల రుణం తీసుకుంటే 70 శాతం రాయితీ
గ్రామీణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.1.50 లక్షలు
పట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.2 లక్షలు
నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21 నుంచి -55 ఏళ్ల లోపు వారు అర్హులు
అగ్రికల్చర్ దరఖాస్తుదారులకు 60 ఏళ్ల వరకు వయోపరిమితి

జూన్ 2 నుంచి 9 వరకు లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేత
ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకుని, ఎంపిడిఒ కార్యాలయం, మున్సిపల్ డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం అందజేయాలి. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు మండల స్థాయిలో బ్యాంకు లింకేజీతో లబ్ధిదారుల్లో అర్హులను ఎంపిక చేస్తారు. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో పరిశీలనతో పాటు మంజూరు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన రాయితీ రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలు ప్రభుత్వం ఇవ్వనుంది. జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News