Thursday, December 19, 2024

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైన నల్గొండ జిల్లా వాసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈనెల 24 నుండి ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో 76వ జాతీయ ఫుట్‌బాల్ సంతోష్ ట్రోఫీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంపిక కొరకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో 40 మందితో కూడిన ప్రాబబుల్స్ లో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కమల్ ఎంపికైనట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి అధ్యక్షులు బండారు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

ఎంపికైన 40 మందికి ఈనెల 13 నుండి 17 వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో శిక్షణ శిబిరం నిర్వహించి మెరుగైన ఆటను ప్రదర్శించిన 20 మంది ఆటగాళ్లతో కూడిన తుది జట్టును తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రకటిస్తుందని తెలిపారు. ప్రాబబుల్స్ లో నల్లగొండ జిల్లా కు స్థానం లభించినందుకు తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ వారికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News