Sunday, January 19, 2025

నాగిన్ రాజ్‌కుమార్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ చలనచిత్ర దర్శకులు రాజ్‌కుమార్ కోహ్లీ కన్నుమూశారు. బాలీవుడ్ అగ్రశ్రేణి నటులతో మల్టీస్టారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత కోహ్లీది నాగిన్, జానీ దుష్మన్, నౌకర్ బీవీకా వంటి పలు సినిమాలు తీశారు. ప్రత్యేకించి నాగిన్ రాజ్‌కుమార్‌గా ఆయన పేరు బాలీవుడ్‌లో మార్మోగింది. 95 సంవత్సరాలరాజ్‌కుమార్ ముంబైలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ స్నేహితుడు విజయ్ గ్రోవర్ వెల్లడించారు. సంజీవ్‌కుమార్, సునీల్ దత్, ధర్మేంద్ర, జితేంద్ర, శతృఘ్ను సిన్హా , రీనా రాయ్ వంటి పలువురు అగ్రశ్రేణి నటీనటులు ఆయన దర్శకత్వంలో పలు సినిమాలలో నటించారు.

ఇవి విశేష ప్రాచుర్యం పొందాయి. రికార్డులు తిరగరాశాయి. పలువురు అగ్రనటీనటులతో ఆయన దర్శకత్వంలో వచ్చిన నాగిన్ సినిమా హిందీలో ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేక్షక ఆదరణకు నోచుకుంది. పూర్తి యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ప్రశాంతంగా ఆయన నివాసంలో ఉదయం మృతి చెంది ఉండగా కుమారుడు అర్మాన్ గుర్తించారు. శాంతక్రజ్ హిందూ శ్మశాన వాటికలో సాయంత్రం జరిగాయి. బద్లే కీ ఆగ్, రాజ్‌తిలక్ , పతీ పత్నీ ఔర్ తవాయిఫ్ సినిమాలు ఆయనవే. ఆయనకు భార్య నటి నిషి కోహ్లీ, కుమారుడు అర్మాన్ కోహ్లీ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News