Monday, January 20, 2025

ఇంటి ఈఎంఐలు కట్టేంత మేరకే ధనవంతుడిని: రాజ్ కుమార్  రావు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ ఏడాది హిట్టయిన హిందీ సినిమా ‘స్త్రీ2’ లో రాజ్ కుమార్ రావు హీరో. ఆ సినిమా దేశంలో రూ. 600 కోట్ల మేరకు రాబట్టింది. ఆ సినిమా హిట్టయినంత మాత్రాన హీరో ఏమి ధనవంతుడైపోలేదు. అదే విషయాన్ని ఆయన ‘అన్ ఫిల్టర్డ్ విత్ సందిశ్’ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘‘ జనం అనుకున్నట్లు నేనేమి అంతలా ధనవంతుడిని కాను’’ అని ఆయన స్పష్టం చేశాడు.

‘‘ఫ్రెండ్, జనం అనుకున్నట్లు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ (రూ. 100 కోట్లు) అంతగా లేదు. ఇల్లు కొనుకున్నాను. దాని ఈఎంఐలు మాత్రం కట్టగలుగుతున్నాను. నేను ఓ షోరూమ్ కు వెళ్లి రూ. 6 కోట్ల కారు కొనే స్థితిలో కూడా లేను’’ అన్నారు. దానికి ‘‘రూ. 6 కోట్ల కారు కొనలేకపోవచ్చు. కానీ రూ. 50 లక్షల కారు కొనుకోవచ్చు కదా?’’ అని అడిగినప్పుడు…‘‘ ప్రస్తుతానికి నాకైతే రూ. 20 లక్షల కారు కొనేంత సత్తానే ఉంది’’ అన్నారు. అదండి..ఆయన పరిస్థితి. కాగా ఆయన ‘స్త్రీ2’ సినిమా తర్వాత వచ్చిన తాజా సెక్స్ కామెడీ చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ సినిమా ఓ మాదిరిగా ఆడుతోంది. త్వరలో ఆయన యాక్షన్ సినిమా ఒకటి రాబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News