Monday, April 28, 2025

మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

- Advertisement -
న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన రోజు నుంచి భారతదేశ ప్రజలు పాకిస్థాన్‌పై పగ తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా పలు ప్రతీకార చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో సోమవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.
భద్రతా సన్నద్ధతపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్‌ కూడా పాల్గొన్నారు. ఆదివారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్‌ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ప్రధానికి.. నేడు రాజ్‌నాథ్ వివరించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News