న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ అమరులైన 100 మందికి పైగా భారత సైనికుల స్మత్యర్థం సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న రేజంగ్ లా వద్ద స్మారక స్థూపాన్ని గతంలో నిర్మించగా ఇప్పుడు దాన్ని పునరుద్ధరించారు. ఆరు దశాబ్దాల క్రితం భారత్-చైనా యుద్ధానికి సంబంధించి రేజంగ్ లాను అత్యంత సాహసోపేతమైన ప్రదేశంగా పరిగణిస్తారు. అమర జవాన్లకు రాజ్‌నాథ్ ఘన నివాళులర్పిస్తూ భారతీయ సైన్యం అసమాన శౌర్యపరాక్రమాలకు, అంకితభావానికి ప్రతిరూపంగా ఈ స్మారకాన్ని ఆయన అభివర్ణించారు. ఈ స్మారకం చరిత్ర పుటలలోనే కాక ప్రతి భారతీయుడి గుండెలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. 18,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో యుద్ధం చేయడాన్ని ఈ నాటికి ఊహించడం అసాధ్యమని, మేజర్ షైతాన్ సింగ్, ఆయన సహచర సైనికులు చివరి శ్వాస వరకు చైనా సైన్యంతో పోరాడారని ఆయన అన్నారు. 1962 నాటి యుద్ధంలో అమరులైన 114 మంది భారతీయ సైనికులకు ఆయన నివాళులర్పించారు.
రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్‌నాథ్ నివాళులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -