- Advertisement -
ఆంటోనీ, శరద్‌పవార్ భేటీ
చైనా సరిహద్దులో పరిస్థితిపై రాజ్‌నాథ్ వివరణ
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు(వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి) వద్ద నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎకె ఆంటోనీ, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌కు రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరించారు. శుక్రవారం ఈ ఇరువురు నేతలు రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ముకుంద్ నరవణె కూడా హాజరయ్యారు. జులై 19నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో రాజ్‌నాథ్ సమావేశం నిర్వహించారు. ఎకె ఆంటోనీ, శరద్‌పవార్‌లు రక్షణశాఖ మాజీ మంత్రులన్నది గమనార్హం. ఆగస్టు 13 వరకు సాగే పార్లమెంట్ సమావేశాల్లో 17 కొత్త బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. వీటిలో ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
Rajnath Singh Briefs Sharad Pawar- AK Antony
- Advertisement -