Friday, December 20, 2024

మాది రాజనీతి.. వారిది అవినీతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్‌ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు. మోడీ నేతృత్వం లో దేశంలో ఒక్క అవినీతి జరగలేదని వెల్లడించారు. 2027 వరకు ప్రపంచంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. భవ్యమైన రామ మందిరం నిర్మించి ప్రాణ ప్రతిష్ట చేశామన్నారు. జమ్మూకశ్మీర్ 370 ఆర్టికల్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం సమాజంలోని మహిళలకు విముక్తి కలిగించా మని వెల్లడించారు. బీజేపీ రాజనీతి పార్టీనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజనీతి పార్టీలు కాదన్నారు. కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకు వచ్చామన్నారు. సిఎఎను తీసుకువచ్చామని పేర్కొన్నారు.

బిజెపి దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ మన విద్యార్థులు ఉన్నారని, రెండు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకోవచ్చారు మోడీ అని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకువచ్చామని క్లారిటీ ఇచ్చారు. గతంలో మహిళలకు 33 శాతం రిజ్వరేషన్ ఇస్తామని అన్నారు కానీ కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. మోడీ వచ్చారు, చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చా రన్నారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తి వంతమైనదిగా అవతరించిందన్నారు. రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా తయారు అయ్యామన్నారు. కిషన్ రెడ్డి తనతో పాటు పని చేశారన్నారు. మీ సమస్యలను మీ ఆలోచనలు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో వినిపిస్తారని వెల్లడించారు. కిషన్ రెడ్డిని గెలిపించండి అని కోరారు. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఈటెలను గెలిపించాలన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేశాడని, బిఆర్‌ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చేశాడని కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను కిషన్‌రెడ్డి కాపాడుతున్నారని మల్కాజిగిరి బిజెపి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కిషన్‌రెడ్డి భుజాలపై ప్రధాని మోడీ అతిపెద్ద బాధ్యత పెట్టారని వెల్లడించారు. మోడీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. కులం, మతం, ప్రాంతం భేదాలు లేకుండా కిషన్‌రెడ్డి సేవలు చేస్తున్నారని, సికింద్రాబాద్ ప్రజలు మరోసారి ఆయనను ఆశీర్వదించాలని కోరుతున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని చేస్తా
పార్టీయే నాకు ఊపిరి: నామినేషన్ వేసిన తర్వాత కిషన్ రెడ్డితన చివరి శ్వాస వరకు బిజెపి జెండా కోసమే పని చేస్తానని, పార్టీయే తన ఊపిరి అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సికింద్రా బాద్ నుంచి తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బిజెపి మధ్యే ఉంటుందన్నారు.

బిఆర్‌ఎస్‌కు కనీసం డిపాజిట్లు రావన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయ కత్వంలో రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో భారతదేశ సైనిక శక్తి బలంగా ఏర్పడిందని, ప్రపంచంలో భారతదేశం శక్తిశాలి దేశంగా అవతరించింద న్నారు. తాను 2019 లో సికింద్రాబాద్ ఎంపిగా గెలవడానికి ముందు అంబర్ పేట, హిమాయత్ నగర్ ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు శానససభ్యుడిగా విజయం సాధించానని. గుర్తు చేశారు. 2008 నుంచి ప్రతిసారి ఎన్నికలకు ముందు గత ఐదేళ్లలో వేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు నివేదికను అనవాయితీగా సమర్పిస్తున్నామని వెల్లడించారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల కోట్లు వెచ్చించా మన్నారు. రూ.720 కోట్లతో. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి వేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News