Wednesday, November 20, 2024

చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ చర్చలు

- Advertisement -
- Advertisement -

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం వియంతియేన్‌లో చైనా రక్షణ శాఖ మంత్రి డాంగ్ జున్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. తూర్పు లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైన్యాలు తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకున్న కొన్ని వారాల తరువాత ఉభయ మంత్రుల మధ్య భేటీ జరిగింది. పది దేశాల ఏషియన్ బృందం, చర్చల భాగస్వాములు కొందరి సమ్మేళనం సందర్భంలో లావోస్ రాజధాని వియంతియేన్‌లో ఈ సమావేశం చోటు చేసుకుంది. ‘రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లావోస్ వియంతియేన్‌లో చైనా రక్షణ శాఖ మంత్రి డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం జరిపారు’ అని రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయం ‘ఎక్స్’లో తెలియజేసింది.

భారత, చైనా దళాలు దాదాపు నాలుగున్నర సంవత్సరాల విరామం తరువాత దెమ్‌చోక్, దెప్సాంగ్ ప్రాంతాల్లో గస్తీ కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టాయి. ప్రధానంగా ఏషియన్ రక్షణ శాఖ మంత్రుల ప్లస్ (ఎడిఎంఎం ప్లస్) సమావేశానికి హాజరయ్యే నిమిత్తం రాజ్‌నాథ్ సింగ్ తన మూడు రోజుల పర్యటనను బుధవారం వియంతియేన్‌లో ప్రారంభించారు. పది దేశాల ఏషియన్, దాని ఎనిమితి చర్చల భాగస్వామ్య దేశాలు భారత్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌తో కూడిన వేదిక ఎడిఎంఎంప్లస్. ఎడిఎంఎంప్లస్ ప్రస్తుత అధ్యక్ష దేశం హోదాలో లావోస్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News