Thursday, January 23, 2025

“చర్చించే ధైర్యం మాకుంది”

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనా నుంచి ఎదురవుతున్న సరిహద్దు సవాళ్లపై పార్లమెంట్‌లో చర్చకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత విషయాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చర్చను ప్రారంభించగా, ఈ క్రమం లోనే కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కల్పించుకుని చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనను ప్రస్తావించారు.

దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ , చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం తమకు ఉందని వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 3 సహా భారత్ సాధించిన ఆయా అంతరిక్ష విజయాలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. దేశ సరిహద్దు భద్రత, దేశ సరిహద్దును రక్షించడంలో సైన్స్ పాత్రను ప్రస్తావించారు. ఈ సందర్భంలో లోక్‌సభలో విపక్ష నేత అథీర్ రంజన్ చౌదరి జోక్యం చేసుకొంటూ చైనాతో సరిహద్దు వివాదాన్ని లేవనెత్తారు. ఈ అంశంపన పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ “ నాకు ధైర్యం ఉంది. చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ” అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News