Monday, December 23, 2024

భారత్ కే గర్వకారణం : రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

కొచ్చి: యోగా దినోత్సవం అంతర్జాతీయంగా నిర్వహించడం , భారత దేశ వారసత్వ సంస్కృతిలో భాగమైన దీన్ని గుర్తించి ప్రపంచమంతా అనుసరించడం దేశానికే గర్వకారణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై వందలాది నేవీ సిబ్బంది, అధికారులు నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.

తొమ్మిదేళ్ల క్రితం యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించినా, భారత్‌తోసహా ప్రపంచం లోని అనేక ప్రాంతాలు శతాబ్దాలుగా యోగాను అభ్యసిస్తున్నాయని పేర్కొన్నారు. నిలకడలేని ప్రస్తుత వేగవంతమైన జీవితంలో అత్యధిక శాతం మంది అనేక భౌతిక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని, వీటన్నిటికీ సమర్థవంతమైన పరిష్కారం యోగాయేనని సూచించారు.

బుధవారం ఉదయాన్నే మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేవీ సిబ్బందితో యోగాలో పాల్గొన్నారు. రక్షణ శాఖ సిబ్బంది దాదాపు గంటసేపు అనేక విన్యాసాలతో యోగా ప్రదర్శనలు నిర్వహించారు. అగ్నివీర సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, ఇతర నేవీ, రక్షణ సీనియర్ అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News