Sunday, January 19, 2025

ఆ విషయంలో ఇంకా మార్పులు చేయాల్సి ఉంది: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలను చూస్తుంటే ఎన్ని మార్పులు చేసినా ఇంకా చేయాల్సింది ఉందనిపిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠినతరం చేసేలా ప్రభుత్వ సవరణలు చేసిందన్నారు. మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశామని పేర్కొన్నారు. మహిళలపై నేరాల విషయంలో కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తున్నప్పటికీ రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.

ఇవాళ భారత దేశాన్ని ప్రపంచం భిన్నమైన కోణంలో పరిశీలిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం పట్ట ఔన్నత్యం, గౌరవం పెరిగిందని ప్రశంసించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారని, కొద్ది రోజుల క్రితం రష్యా పర్యటనకు కూడా వెళ్లారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్న సమయంలో పిఎం నరేంద్ర మోడీ ఇరు దేశాలలో పర్యటించిన ప్రముఖుడు అని కొనియాడారు. దక్షిణ భాగంలో భారతదేశం అతిపెద్ద వాయిస్‌గా మారిందని, ప్రతి దేశం ఇప్పుడు ముఖ్యమైన సమస్యలపై భారతదేశం అభిప్రాయాన్ని తీసుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. ఇంతకుముందు భారత దేశ ప్రధాని ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు భారత్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News