Wednesday, January 22, 2025

మోడీ మూడోసారి రావడం ఖాయం: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మంలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ మైదానం నుంచి మయూరి సెంటర్ వరకు బిజెపి ర్యాలీ నిర్వహించింది. ఈ రోడ్ షోలో రాజ్ నాథ్ సింగ్, బిజెపి ఎంపి అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటుకు బిజెపి పూర్తిగా సహకరించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిఆర్ఎస్ భారీగా అవినీతికి పాల్పడిందని రాజ్ నాథ్ ఆరోపించారు. అవినీతి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరమికొట్టారని ఎద్దేవా చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. మోడీ మూడోసారి రావడం ఖాయం.. ఉమ్మడి పౌరస్మృతి అమలు ఖాయమని స్పష్టం చేశారు. 2027 కల్లా భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా చేయడమే లక్ష్యమన్నారు. బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి ప్రభుత్వాలేనని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News