Sunday, December 22, 2024

చేప, ఏనుగు, గుర్రం దేనినైనా తినండి.. ఎందుకు ఈ షో?

- Advertisement -
- Advertisement -

తేజస్వి యాదవ్‌పై రాజ్‌నాథ్ ఆగ్రహం

పాట్నా : జైలులో ఉండి, బెయిల్‌పై విడుదల అయినవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విమర్శించారు. ఆర్‌జెడి ఎంపి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిషా భారతి ఇటీవల చేసిన ఒక వ్యాఖ్యకు రాజ్‌నాథ్ సింగ్ ఆ విధంగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆర్‌జెడి నేత, లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడుతూ, ఒక వర్గం వోటర్లను మెప్పించేందుకు నవరాత్రి సమయంలో మాంసాహారం తీసుకుంటున్న దృశ్యాలను కొందరు నేతలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

బీహార్ జముయి జిల్లాలో బిజెపి ఎన్నికల సభలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ, ‘నవరాత్రి సమయంలో మీరు చేప తింటున్నారు. మీరు ఏ సందేశం పంపాలని అనుకుంటున్నారు? మీరు కోరుకునేది ఏదైనా చేప, పంది, పావురం, ఏనుగు లేదా గుర్రం తినండి. షో చేయవలసినఅగత్యం ఏమి ఉంది? ఇది కేవలం వోట్ల కోసం. బుజ్జగింపు రాజకీయాల కోసం. దీని కారణంగా ఒక నిర్దిష్ట మతం ప్రజలు తమకు వోటు వేస్తారని వారు భావిస్తున్నారు. లాలూజీ అటువంటి వారి సంగతి చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. ఎన్‌డిఎ అభ్యర్థి, ఎల్‌జెపి (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ బావమరది అరుణ్ భారతికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. తేజస్వి యాదవ్ చేప తింటున్నట్లుగా ఇటీవల విడుదలైన ఒక వీడియోను వృష్టిలో పెట్టుకుని రాజ్‌నాథ్ సింగ్ ఆ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News