Monday, December 23, 2024

వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. జమ్మికుంటలో జరిగిన బిజెపి బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ప్రసంగించారు. రాణి రుద్రమ దేవీ, కోమురంభీమ్ లాంటి ఎంతో పరాక్రమవంతులు ఈ గడ్డపై పుట్టారని ప్రశంసించారు. 1984లో బిజెపి రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచిందని, తెలంగాణ నుంచి బిజెపి అభ్యర్థి జంగారెడ్డి ఎన్నికయ్యారని ప్రశంసించారు. పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో సిఎం కెసిఆర్ చెప్పాలని రాజ్‌నాథ్ సింగ్ నిలదీశారు. తెలంగాణ పోరాటం కేవలం సిఎం కెసిఆర్ ఒక్కరే చేయలేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిజెపి పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. రెండు సార్లు అధికారమిచ్చినా తెలంగాణలో అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రజలను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News