Monday, December 23, 2024

రాజ్‌నాథ్ సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్…ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆయన నేడు న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ సమావేశంలో పాల్గొనాల్సి ఉండింది. కానీ కోవిడ్ పాజిటివ్ అని పరీక్షలో తేలాక ఆయన ఆ సమావేశానికి హాజరు కాబోడంలేదు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. డాక్టర్ల బృందం ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించారు. ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆయన సోమవారం ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News