Thursday, January 9, 2025

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

Rajnath Singh visited the family of Krishnam Raju

హైదరాబాద్‌: దివంగత సీనియర్ తెలుగు నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, హీరో ప్రభాస్‌ను కేంద్రమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌  రెబల్ స్టార్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతరం షేక్‌పేటలోని దర్గాకు సమీపంలో ఉన్న జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో కృష్ణంరాజు సంతాపసభకు కేంద్ర మంత్రి హాజరయ్యారు. రక్షణ మంత్రి వెంట రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సంతాప సభలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో దివంగత కృష్ణంరాజు చేసిన కృషిని మంత్రి కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News