Friday, December 27, 2024

ఉగ్రవాదాన్ని అణచడం చేతకాకపోతే మేము సిద్ధం: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్థాన్ కు చేతకాకపోతే, భారత్ సహకారం అందించగలదని రాజ్ నాథ్ సింగ్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ లోకి ప్రవేశించి తప్పించుకునే ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టు పెడతామని హెచ్చరించారు. భారత్ ఏ దేశంపై దాడి చేయదని కానీ భారత్ లో శాంతికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోబోమని అన్నారు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్ లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనుక భారత్ హస్తం ఉందని యూకె పత్రిక ‘ది గార్డియన్’ ఇటీవల ఓ రిపోర్టులో రాసింది. కానీ దానిని భారత విదేశాంఖ తీవ్రంగా ఖండించింది. ‘టార్గెట్ హత్యలు చేయడమన్నది భారత్ విధానం కాదు’ అని ఖరాఖండిగా తెలిపింది.

రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ స్పందించింది. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News