Friday, December 20, 2024

కర్తవ్యపథ్‌గా మారనున్న రాజ్‌పథ్

- Advertisement -
- Advertisement -

Rajpath will become Kartavyapath

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చరిత్రాత్మక రాజ్‌పథ్ పేరు కర్తవ్యపథ్‌గా మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డిఎంసి) ఈ నెల ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చే ప్రతిపాదనపై కౌన్సిల్‌లో చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాజ్‌పథ్, సెంట్రల్‌విస్టా వీధులను కర్తవ్యపథ్‌గా పేరు మార్చడంపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు సోమవారం వెల్లడించారు. ఇండియాగేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకనుంచి కర్తవ్యపథ్‌గా పిలువనున్నారని తెలిపారు. కాగా బ్రిటిష్ పాలనకాలం నుంచి కింగ్స్‌వేను రాజ్‌పథ్‌గా పిలుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News