Tuesday, January 7, 2025

‘రాజు గారి దొంగలు’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజు గారి దొంగలు సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ -‘రాజు గారి దొంగలు టీజర్ బాగుంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా‘అని అన్నారు. డైరెక్టర్ లోహిత్ రనల్ హిటాసో మాట్లాడుతూ ‘నా డ్రీమ్‌ను, నన్ను నమ్మి మా నాన్న ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే నా ఫ్రెండ్స్ అంతా ఈ మూవీలో నటించారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా.

మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. త్వరలోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాం‘అని తెలిపారు. నిర్మాత నడిమింటి బంగారునాయుడు మాట్లాడుతూ ‘రాజు గారి దొంగలు సినిమాతో మా అబ్బాయి లోకేష్ డైరెక్టర్ గా మారుతుండటం సంతోషంగా ఉంది. ఒక మంచి కథతో ఈ మూవీ చేశాడు. టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరణ పొందుతుంది. త్వరలోనే మా రాజు గారి దొంగలు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెమ్ వేణు గోపాల్, జెమిని సురేష్, సినిమా నటీ నటులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News