Monday, December 23, 2024

రాజుగారి కోడి పులావ్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్

- Advertisement -
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వియ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు నాలుగున థియేటర్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విజయోత్సవాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ముందుగా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విడుదలైన దగ్గర నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందంటే దానికి కారణం మీడియా రాసిన రివ్యూ అని ఈ రోజుల్లో పబ్లిక్ టాక్ కన్నా వెబ్సైట్ రివ్యూలను చదివే సినిమాలు చూస్తున్నారని అన్నారు. సినిమా విడుదల రోజు కొంచెం భయంగా ఉండిందని, తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యాను అన్నారు. సినిమా చూడని వాళ్ళు కచ్చితంగా థియేటర్లో రాజు గారి కోడి పులావ్ ను రుచి చూస్తే కచ్చితంగా థ్రిల్ గా ఫీల్ అవుతారని పేర్కొన్నారు.
అదేవిధంగా హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. అన్ని చోట్ల నుండి సినిమాకి పాజిటివ్ వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే సినిమాలో కంటెంట్ కొంచెం ఎక్కువ బోల్డ్ గా చూపించారని అంటున్నారు. నిజానికి బయట జరుగుతుందే సినిమాలో చూపించామని అన్నారు. బయట ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తున్నారు. అలాంటిది సినిమా చూడడానికి ఎందుకు మొహమాటం అని అన్నారు. సినిమాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అని విజ్ఞప్తి చేశారు.
తెరమీద యాక్టర్స్ అందంగా కనిపించడం కోసం యూనిట్ ఎంత కష్ట పడుతుందో సినిమా చూసినప్పుడు అర్థమైందని హీరో అభిలాష్ బండారి సినిమా నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ తర్వాత డబ్బింగ్ అని, రీషూట్స్ అని ఇలా ఏం చేసినా దీని వెనక డైరెక్టర్ యాక్టర్ శివ కోన ఉన్నారని ధైర్యంగా ఉండేదని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శివ కోన కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభాకర్ గురించి మాట్లాడుతూ.. బిజీ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా చిన్న సినిమాను సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో కొత్త వాళ్ళైనా సరే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాలో నటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమా విడుదల రోజు వైజాగ్ లో థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు చాలా పాజిటివ్ గా అనిపించిందని అన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుండి ఒక డైరెక్టర్ కాల్ చేశారని ఫస్ట్ ఆఫ్ లో ఒక సన్నివేశంలో వచ్చే ఎమోషన్ గురించి డిసప్పాయింట్ గా మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కాల్ చేయండి అని చెప్పానన్నారు. తర్వాత ఆ డైరెక్టర్ ఫోన్ చేసి చాలా బాగుంది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అక్కడ ఎందుకు ఎమోషన్ మిస్ మ్యాచ్ అయిందో అని వివరించారు.
ఈ విషయంలో డైరెక్టర్ గా శివకోనాకు హ్యాట్సాఫ్ తెలియజేస్తున్నాను అని అన్నారు. దీన్ని బట్టి తనకు కథ ఎంత గ్రిప్టింగా ఉంటే ఆ చిన్న విషయాన్ని కూడా అలా చేయగలడు అని, ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ కె చెందుతుంది అని పేర్కొన్నారు. ఈ సినిమ తర్వాత నెక్ట్స్ సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం కన్నా.. ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది అని, ఎందుకంటే సినిమాలో చాలా రకాల ఎమోషన్స్ ను ఉన్నాయన్నారు. ఇక సినిమాను థియేటర్లో చూసినప్పుడు ఎక్కడ చిన్న సినిమా అన్న ఫీలింగ్ రాదని కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాను తలపిస్తుందని పేర్కొన్నారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ మనీ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందించారని కొని ఆడారు.
ఇక సినిమా మొత్తం ఎడిట్ గేమ్ మాదిరి ఉంటుందని అందుకు కారణమైన ఎడిటర్ బసవ, డైరెక్టర్ శివ కోన లకు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఈ వీకెండ్ అందరూ కచ్చితంగా రాజు గారి కోడి పులావ్ చిత్రాన్ని చూడాల్సిందేనని కోరారు. ఈ చిత్రం ఓటీడీలో చూసే దానికన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని తెలిపారు. ఇక సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటాడని అన్నారు. అలాగే ఈ సినిమాకు రచన సహకారాన్ని అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి సంద్రాన ను స్క్రీన్ పై చూడడం ఆనందంగా అనిపించిందని ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని అన్నారు.
సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తానని చాలా ఆనందంగా ఉందని, ఇది కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అని, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు థాంక్స్ చెప్పారు నటి శ్రీ సుధా.
సినిమాకు రచన సహకారాన్ని అందించిన రవి సంద్రాన మాట్లాడుతూ తమకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదని.. ఇండిపెండెంట్ గా వచ్చి సొంతంగా టీంని బిల్డ్ చేసుకొని సినిమా కోసం ఎన్నో రోజులు కష్టపడి తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని ఈరోజు రివ్యూస్ చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా పట్ల అందరూ చాలా పాజిటివ్ గా ఉన్నారని, కొంతమంది ఓటీటీలో చూద్దామని అనుకుంటున్నారు, కానీ ఇది థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేసే సినిమా అని నమ్మకంగా చెప్పారు. రాజు గారి కోడి పులావ్ పెద్ద సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ, కంటెంట్ తో డెబ్యూ డైరెక్టర్ అయినా.. చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లా శివ కోన సినిమాని తెరకెక్కించాడని, ఈ వీకెండ్ కొంచెం వీలు చేసుకుని సినిమాను థియేటర్లో చూడాల్సిందిగా కోరారు.
సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చాలా మంచి క్యారెక్టర్ అని, పిలిచిమరి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు జబర్దస్త్ నవీన్ ధన్యవాదాలు తెలిపారు సినిమాలో కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్లను పట్టించుకోరని, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడరని, ప్రేక్షక దేవుళ్ళు చిత్రాన్ని విజయవంతం చేస్తారని.. అదే రాజు గారి కోడి పులావ్ కు పునరావృతం అయిందని తెలిపారు. ఇక తన క్యారెక్టర్ గురించి ఫన్నీగా రీల్స్, మీమ్స్ చేస్తున్నారని ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
చివరగా డైరెక్టర్ హీరో నిర్మాత శివ కోన మాట్లాడుతూ.. తాము ఇండిపెండెంట్గా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీశామని,హ వారు వెనక పెద్ద ప్రొడక్షన్ అవధులు కానీ బడా నిర్మాతలు కానీ లేరన్నారు. తామంతా సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమేనని చెప్పారు. అలా వచ్చిన మేము ఫుల్ మూవీ తీయగలమా అనే అనుమానం నుంచి, కేవలం కథను, ప్రొడక్షన్ వాల్యూస్ ను నమ్ముకొని ఈ సినిమా తీశామని చెప్పారు. సినిమా కంటెంట్ నచ్చి మీడియా మిత్రులు చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారని, అయితే అవి టికెట్ రూపంలో కన్వర్ట్ కావడం కూడా చాలా ముఖ్యమని అన్నారు. అయితే చాలా వరకు రాజు గారి కోడిపులావ్ సినిమా విడుదలైన విషయమే తెలియదని, దానికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చని అందులో భాగంగా తాము ప్రమోషన్ లో స్టార్ హీరోలను గాని, స్టార్ కంపెనింగ్ చేసేంత అంత పవర్ లేదని.. సొంతంగా కేవలం సినిమా అంటే ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చామన్నారు.
చాలామంది చిన్న సినిమా అయినా అద్భుతమైన కంటెంట్ ను అందించారని మెచ్చుకుంటున్నారు. అదే మాదిరిగా సినిమాను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తే బాగుంటుందని తెలిపారు. ఇదే కంటెంట్తో ఇతర లాంగ్వేజ్ నుంచి ఏదైనా సినిమా వస్తే మనవాళ్లు ప్రోత్సహిస్తారని, అలాగే ఈ సినిమాపై కొంత సమయం పెట్టి చూస్తే ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని పేర్కొన్నారు. చాలామంది సినిమా ఫస్ట్ హాఫ్ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉందని అంటున్నారు సినిమాలో పాటలు గాని అనవసరమైన సీన్లు కానీ సపరేట్ కామెడీ ట్రాక్స్ కానీ లేకుండా ఆధ్యాంతం కట్టిపడేసేలా తెరకెక్కించారని అందరూ మెచ్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. కేవలం కంటెంట్ ను జెన్యూన్ గా చెప్పామని మీ సమయాన్ని ఒక రెండున్నర గంటలు కేటాయిస్తే డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్ నుండి బయటకు వస్తారని డైరెక్టర్ శివ కోన తెలిపారు. ఇక సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అలాగే సినిమాను ఇంత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News