Thursday, January 23, 2025

మీడియాకు మంచివార్త..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023కు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ దేశంలో ప్రింట్ , పబ్లిషింగ్ పరిశ్రమ నమోదు ప్రక్రియకు సంబంధించి ఉన్న సంబంధిత చట్టం స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చారు. బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అంతకు ముందు దీనిపై జరిగిన చర్చకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ జవాబిచ్చారు.

ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లుతో ఇక ప్రచురణ, ముద్రణ రంగంలోని వారికి సరైన సౌలభ్యం ఏర్పడుతుందని , ప్రత్యేకించి మీడియాకు ఉపయుక్తం అవుతుందని, వలసపాలన నాటి కటుతర నిబంధనలు, వివక్షపూరిత విధానాలు ఇక కుదరవని తెలిపారు. పత్రికల నమోదు, ప్రచురణల విభాగంలో ఇప్పటివరకూ ఉన్న బ్యూరోక్రటిక్ అలసత్వ భారం తొలిగి తీరుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News