Monday, January 20, 2025

టెలికాం బిల్లుకు పార్లమెంటు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా ప్రభుత్వం తాత్కాలికంగా టెలికాం సర్వీసలను తన అధీనంలోకి తీసుకోవడానికి, అలాగే వేలం లేకుండా శాటిలైట్ స్పెక్ట్రంను కేటాయించడానికి వీలు కల్పించే టెలీ కమ్యూనికేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. లోక్‌సభ బుధవారం ఈ బిల్లును స్వల్ప చర్చ అనంతరం ఆమోదించిన విషయం తెలిసిందే.జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా టెలికాం సేవలను తాత్కాలికంగా తన అధీనంలోకి తీసుకోవడానికి,

అలాగే శాటిలైట్ స్పెక్ట్రం కేటాయింపునకు వేలం లేని విధానాన్ని కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు.అంతేకాకుండా ప్రజా ఆత్యయిక స్థితి ఎదురయినప్పుడు లేదా ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌ను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి రెండు చట్టాల స్థానంలో నవభారత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బిల్లును తీసుకువచ్చినట్లు బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News