- Advertisement -
న్యూఢిల్లీ: అస్సాం, మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు సర్బనంద సోనోవాల్, ఎల్ మురుగన్‌ను బిజెపి శనివారం ప్రకటించింది. ఈ ఇద్దరు నాయకులను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన మంత్రివర్గ సహచరులుగా నియమించడంతో ఆరు నెలల్లో వారు పార్లమెంట్‌కు ఎన్నిక కావలసిన అవసరం ఉంది. ఈ రెండు రాష్ట్ర అసెంబ్లీలలో బిజెపికి మెజారిటీ ఉన్నందున రాజ్యసభ సభ్యులుగా వీరి ఎన్నిక లాంఛనమేనని చెప్పవచ్చు. అస్సాం అసెంబ్లీ స్పీకర్‌గా బిశ్వజిత్ దైమరీ ఎన్నికైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అదే విధంగా కర్నాటక గవర్నర్‌గా నియమితులు కావడంతో కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ రాజీనామా చేసిన దరిమిలా మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది.
- Advertisement -