Thursday, December 26, 2024

రాజ్యసభ చైర్మన్ చైర్‌లో పీటీ ఉష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభలో గురువారం అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మేటి అథ్లెట్, ఎంపీ పీటీ ఉష, రాజ్యసభ చైర్మన్ చైర్‌లో కూర్చుని సభా వ్యవహారాలను నడిపించారు. ఛైర్మన్ జగదీష్ థన్‌కర్ సభలో లేని సమయంలో పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష, తన ట్విట్టర్ లో ఈ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు. సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందని, మరిన్ని మైలు రాళ్లను అందుకోనున్నట్టు ఆమె ఆ వీడియోపై కామెంట్ చేశారు.

2022లో బీజేపీ తరఫున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. గొప్పశక్తి గొప్ప బాధ్యతలో ఉంటుందని, ఫ్రాంక్టిన్ డీ రూజ్‌వెల్ట్‌కు చెందిన కొటేషన్‌ను ఆమె తన వీడియోలో పోస్ట్ చేశారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యత, నమ్మకంతో మరిన్ని మైలు రాళ్లను క్రియేట్ చేయనున్నట్టు ఆమె చెప్పారు.పిటి ఉష వీడియో పోస్టు చేయగానే ఆమె అభిమానులు కంగ్రాట్స్ మెసేజ్‌లు చేశారు. మహిళా స్ప్రింటర్‌గా ఉష ఇండియా తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఏషియన్ గేమ్స్, ఏషియన్ చాంపియన్ షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్లలో పాల్గొన్నారు తన కెరీర్‌లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను నెలకొల్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News