Thursday, January 23, 2025

ఎంపి సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ చైర్మన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ చైర్మన్ చైర్మన్ జగ్దీప్ ధన్ ఖడ్,  ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఎంపి సంతోష్ కోట్లాది మొక్కలు నాటే యజ్ఞం చేస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లింకా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కిందని తెలిపారు. రికార్డు సంఖ్యలో ఒకేసారి ఆదిలాబాద్ జిల్లాలో 16 వేల మంది ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటారన్నారు. ఎంపి సంతోష్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని జగ్ దీప్ ధన్ ఖడ్ అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా తమ కరతాళ ధ్వనుల ద్వారా ఎంపి సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News