Friday, December 20, 2024

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల సీన్ హాట్ హాట్…

- Advertisement -
- Advertisement -

బీజేపీజేడీ(ఎస్)నుంచి మరో అభ్యర్థి పోటీ

బెంగళూరు : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కర్ణాటక నుంచి నాలుగు స్థానాలు భర్తీ కావలసి ఉండగా మూడు స్థానాలు పోను మిగిలిన ఒకే ఒక్క స్థానానికి బీజేపీ జేడీ(ఎస్) ఉమ్మడి అభ్యర్థిగా రెండో వ్యక్తిని రంగంలో దింపారు. ఈనెల 27న ఈ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యుల్లో అధికార పార్టీకి 135 మంది ఉన్నారు. దీంతోపాటు సర్వోదయ కర్ణాటక పక్ష నుంచి దర్శన్ పుట్టనయ్య , మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మూడు స్థానాలను పొందగలుగుతారని భావిస్తున్నారు. బీజేపీ, జెడీ(ఎస్) క్రమంగా 66, 19 మంది సభ్యులను కలిగి ఉన్నారు.

వీరంతా ఒకే ఒక స్థానం పొందగలిగే అవకాశం ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం విజయం సాధించడానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే ప్రతి అభ్యర్థి 45 ఓట్లను సాధించవలసి ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉంటే అప్పుడు ఓట్ల ప్రాధాన్యత బట్టి ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా అజయ్ మకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్ లను రంగం లోకి దింపింది. వీరంతా గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్‌ఛార్జి రణదీప్ సింగ్‌సర్జేవాలా, తదితరులు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంఎల్‌సి నారాయన్స బండగే నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర, అసెంబ్లీలో విపక్ష నేత ఆర్. అశోక, తదితరులతో పాటు జెడి( ఎస్ ) అధ్యక్షుడు , మాజీ సిఎం హెచ్. డి. కుమారస్వామి కూడా బీజేపీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అకస్మాత్తుగా జెడి(ఎస్ )నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు డి కుపేంద్ర రెడ్డి కూడా పోటీ అవసరమని గురువారం నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఆయనకు తోడుగా కుమారస్వామి, విజయేంద్ర, అశోక కూడా రావడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈసారి ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(బీజేపీ), కాంగ్రెస్‌కు చెందిన చంద్రశేఖర్, ఎల్. హనుమంతయ్య, హుస్సేన్, తమ ఆరేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో ఏప్రిల్ 2 న రిటైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News