Thursday, January 23, 2025

పైరసీకి పాల్పడితే మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతోనే సినిమాటోగ్రఫీ( సవరణ) బిల్లు2023కు సభ ఆమోదం తెలిపింది. సినిమా పైరసీకి పాల్పడే వారికి మూడేళ్లవరకు జైలుశిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే సినిమా వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచారు.

పదేళ్లు చెల్లుబాటయ్యేలా ఇప్పటివరకు సినిమాలకు సర్టిఫికెట్లు ఇస్తుండగా,ఇకపై దాన్ని ఎత్తివేసి శాశ్వత సర్టిఫికెట్లు జారీ చేస్తారు.అలాగే వయసు వారీగా ‘యుఎ’ సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రతిపాదించారు. ఇకపై యుఎ7 ప్లస్,యుఎ 13ప్లస్, యుఎ 16 ప్లస్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.అలాగే టెలివిజన్, ఇతర మాధ్యమాల్లో ప్రసారానికి ప్రత్యేక సర్టిఫికెట్ జారీ చేసేందుకు సిబిఎఫ్‌సి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్)కి అనుమతించారు. బిల్లుపై చర్చకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ, పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు జరగుతున్న రూ.20,000 కోట్ల నష్టాన్ని అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News