Monday, December 23, 2024

ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్ మృతికి రాజ్యసభ నివాళి

- Advertisement -
- Advertisement -

Rajya Sabha pays tribute to famous singer Lata Mangeshkar

 

న్యూఢిల్లీ : ప్రముఖ గాయని లతామంగేష్కర్ మృతికి రాజ్యసభ సోమవారం నివాళులు అర్పించింది. రాజ్యసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్ తన 92 వ ఏట 6 వ తేదీన పరమపదించారని చెప్పారు. ఆమెను స్మరించుకుంటూ సందేశం చదివి వినిపించారు. దాదాసాహెబ్, భారత రత్న ది నైటింగేల్ , మెలోడీ క్వీన్, వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో ఆమె పొందారని, ఏడు దశాబ్దాలకు మించిన తన కెరీర్‌లో ఒక విదేశీ భాషతోపాటు మొత్తం 36 భారతీయ భాషల్లో 25 వేలకు మించి పాటలు పాడారని గుర్తు చేశారు. లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్పగాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింఇ. ఆమె మరణం ఓ శకానికి ముగింపు , సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది అని ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపం తెలియచేశారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News