Friday, December 20, 2024

రాజ్యసభ ఎన్నికలు… జైల్లో ఉన్న సభ్యులకు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ముంబై: రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న సమయంలో మహారాష్ట్రలో అధికార కూటమికి చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలు దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రత్యేక కోర్టు, బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో జైల్లో ఉన్న ఇద్దరు నేతలు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు గాను జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

ఇందులో మహావికాస్ అఘాడీ తరఫున శివసేన రెండు, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. బిజెపి కూడా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే శివసేన, కాంగ్రెస్, ఎన్‌పీపీలు ఒక్కో స్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న బిజెపి కూడా రెండు స్థానాలు తేలికగా గెలవగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనున్నది. ఈ నేపథ్యం లోనే ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలు ఓటు వేసేందుకు అవకాశం లభించక పోవడం మహావికాస్ అఘాడీకి సమస్యగా మారింది. ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. మరో కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.

Rajya Sabha Polls: Special Court ignores Maharashtra leaders bail plea

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News