Friday, January 17, 2025

రాజ్యసభ సమావేశాలు సోమవారానికి వాయిదా

- Advertisement -
- Advertisement -

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అభిశంసన కోరుతూ ప్రతిపక్షాలు శుక్రవారం రాజ్యసభలో గందరగోళం సృష్టించారు.అంతేకాక అధికార పక్షం తో గొడవపడ్డారు. అదానీ వివాదంపై సభా కార్యక్రమాలు తొలి గంటలోనే దెబ్బతిన్నాయి. దాంతో కార్యక్రమాలను వాయిదా వేశారు. ప్రతి రోజూ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. తాను రైతు బిడ్డనని, తాను బలహీనతను చాటనని ధన్‌కర్ అన్నారు.వారు నాకు వ్యతిరేకంగా తీర్మానం తేవొచ్చు. అది వారి రాజ్యాంగ హక్కు. కానీ వారు రాజ్యాంగ విధానాలను తప్పుతున్నారని జగదీప్ ధన్‌ఖర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ చైర్మన్ సభాకార్యక్రమాలను సోమవారానికి వాయిదా వేశారు. ప్రతిష్టంభనను తొలగించేందుకు తన ఛాంబర్ కు రావలసిందిగా ఆయన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను, అధికార పక్ష సభా నాయకుడు జెపి.నడ్డాను కోరారు.

బిజెపికి చెందిన రాధా మోహన్ దాస్ అగర్వాల్ ఉపరాష్ట్రపతి పై అవిశ్వాస తీర్మానం పై విధివిధానాలపై పాయింట్ ఆఫ్
ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో ప్రెస్ వద్దకు వెళుతోంది. గతంలో నెహ్రూ కూడా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ను అవమానించేవారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు చికిత్స కూడా అందించలేదని, ఆయన అంత్యక్రియలు కూడా దేశ రాజధానిలో జరగకుండా చేశారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలకు హాజరు కావొద్దని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నెహ్రూ కోరారని, కానీ ప్రధాని మాట వినకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ అంత్యక్రియలకు వెళ్లారని తెలిపారు.అవిశ్వాస తీర్మానం చేపట్టడానికి ప్రతిపక్ష నాయకుడు ఖర్గే 14 రోజులు ఆగి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ కు రాజ్యాంగంలో నమ్మకం లేదని కూడా అన్నారు.దీనికి ముందు రూల్ 267 కింద తనకు నాలుగు నోటీసులు అందాయని ధన్‌ఖర్ తెలిపారు. సభా కార్యక్రమాలను ప్రక్కనబెట్టి ఈ విషయాన్ని చేపట్టాలని డిమాండ్ చేశాన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News