Monday, January 20, 2025

వర్షాకాల సెషన్‌కు తెర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం ఎగువ సభ నిరవధిక వాయిదా పడింది. వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి సభలో మణిపూర్ విషయంపై ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి నడుమనే శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు మణిపూర్ పరిస్దితిపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని పట్టుపట్టాయి. దీనితో లంచ్‌కు ముందు రెండుసార్లు వాయిదా పడ్డ సభ ఆ తరువాత భోజనానంతరం సమావేశం అయింది. జిఎస్‌టి సంబంధిత రెండు బిల్లులను ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభకు మూజువాణి ఓటుతో తిప్పిపంపించారు. ఆప్ ఎంపి రాఘవ చద్ధాపై సస్పెన్షన్ తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది. ఈ ప్రక్రియలు ముగియగానే సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆనవాయితీ ప్రసంగం తరువాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News