Saturday, December 21, 2024

ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Rakesh Jhunjhunwala passes away at 62

 

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఝున్‌ఝున్‌వాలా ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్‌ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది. ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన 1985లో స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్‌ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News