- Advertisement -
న్యూఢిల్లీ : బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా విమానయాన రంగంపై దృష్టిపెట్టారు. భారత్‌లో కొత్త విమాన సంస్థ కోసం వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలను కొనుగోలు చేయాలని ఆయన యోచిస్తున్నారు. దేశీయ ప్రజలు విమానంలో ప్రయాణించాలనే ఆశలను కల్గివున్నారని, వారికి అనుగుణంగా విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నామని రాకేశ్ తెలిపారు. వచ్చే 15 రోజుల్లో విమానయాన మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చే అవకాశముంది. దీని ప్రకారం విమాన సంస్థలో 40 శాతం సొంతం చేసుకుని, 35 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాలని ఆయన భావిస్తున్నారు.
- Advertisement -