న్యూఢిల్లీ: తెలంగాణలో సాగు అనుకూల విధానాలు అమలవుతున్నాయని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయిన రాకేశ్ తికాయత్ భేటీ సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ అములు చేస్తున్నారని తికాయత్ తెలిపారు. రైతు సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు నేత పేర్కొన్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం నూతన విధానం రావాలని ఆయన ఆకాక్షించారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాని తికాయత్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే కెసిఆర్ ను కలిశాని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా సిఎంలందరినీ కలుస్తానని చెప్పారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలు త్వరలోనే కెసిఆర్ కు ఇస్తామని తెలిపారు. అమరులైన రైతుల కుటుంబాలకు కెసిఆర్ పరిహారం అందిస్తారని చెప్పుకొచ్చారు. వ్యవసాయంపై హైదరాబాద్ లేదా మరో చోట అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయలన్నారు.
సిఎం కెసిఆర్ తో ముగిసిన రాకేశ్ తికాయత్ భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -