న్యూఢిల్లీ: సరిహద్దుల నుంచి రైతులను బలవంతంగా తొలగించినట్లయితే తాము దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలను ‘ధాన్యపు మండీలు’(గల్లా మండీస్)గా మార్చుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ఆదివారం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. విశేషమేమిటంటే ఘాజీపూర్, తిక్రీ బార్డర్ల నుంచి బారికేడ్లు, సిమెంట్ బ్లాకులు తొలగించిన రెండు రోజులకు ఆయన ఈ హెచ్చరిక చేశారు. కేంద్రం ఏకపక్షంగా తెచ్చిన మూడు సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీని కలుపుతున్న వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో నిరసన ఆందోళనలు జరుపుతున్నారని అందరికీ తెలిసిన విషయమే.
किसानों को अगर बॉर्डरो से जबरन हटाने की कोशिश हुई तो वे देश भर में सरकारी दफ्तरों को गल्ला मंडी बना देंगे ।#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) October 31, 2021