Monday, December 23, 2024

కాసేపట్లో రాకేశ్ మృతదేహానికి అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Rakesh's funeral in warangal

వరంగల్: కాసేపట్లో దబీర్ పేట్లో రాకేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దబీర్ పేటలో కుటుంబసభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. రాకేశ్ అంతిమయాత్రలో టిఆర్ఎస్ నేతలు, స్థానికులు భారీగా పాల్గొన్నారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో రాకేశ్ పాల్గొన్నాడు. నర్సంపేట నియోజకవర్గంలో నేడు బంద్ కొనసాగుతోంది. రాకేశ్ మృతికి సంతాపంగా నర్సంపేట ప్రజలు బంద్ పాటిస్తున్నారు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, దుకాణాలు, సినిమాహాళ్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేట మీదగా వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నర్సంపేట ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News