Monday, December 23, 2024

అన్నా చెళ్ళెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ : చైర్మన్ వాసుదేవ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ :  రాఖీ అన్నా చెళ్ళెళ్ల అనుబంధానికి ప్రతీక అని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు. రక్షా బంధన్ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఉదయం వికలాంగుల సోదరీమణులు వాసుదేవ రెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, వసంత, అంధురాలు నాగరాణి మాట్లాడుతూ నిత్యం వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సోదరుడు చైర్మన్ వాసుదేవ రెడ్డికి రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాఖీ కట్టిన సోదరిమణులకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’ , నాన్నలోని రెండవ అక్షరం ‘న్న’ యే.. ‘‘అన్న’’ అని ’ అమ్మ,నాన్నల ప్రతిరూపం నుండే వచ్చింది ఈ రక్షాబంధన్ అన్నారు. సోదరీమణులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలను వాసుదేవ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News