Sunday, December 22, 2024

మరో పెళ్లి చేసుకున్న రాఖీ సావంత్ మాజీ భర్త

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ దురానీ మరో వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్ ను తాను ఈ నెల 3న వివాహం చేసుకున్నట్లు ఆదిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పెళ్లి ఫోటోలను అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

రాఖీ సావంత్, ఆదిల్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే ఆదిల్ తనను హింసిస్తున్నాడంటూ రాఖీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్ ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. రాఖీ తనను మోసం చేసిందన్నాడు. అంతకుముందు రితేశ్ సింగ్ ను పెళ్లి చేసుకున్న రాఖీ, అతనినుంచి విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్పి తనను వివాహం చేసుకుందని ఆరోపించాడు. ఆ తర్వాత ఆదిల్ నుంచి విడాకులు తీసుకున్నట్లు రాఖీ స్పష్టం చేసింది.

Rakhi savanth farmer husbands second marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News