Monday, December 23, 2024

బాదం బహుమతితో రక్షా బంధాన్ని వేడుకగా జరుపుకోండి!

- Advertisement -
- Advertisement -

ఉత్సవాల నెల ప్రారంభమైంది. తోబుట్టువుల మధ్య మధురమైన బంధం వేడుక చేసే రక్షా బంధన్ దగ్గరలోనే ఉంది. సోదరి, సోదరుడి మణికట్టుపై దారం లేదా ‘రాఖీ’ కట్టడం ఈ పండుగ గుర్తుగా ఉంటుంది. తోబుట్టువుల మధ్య ఈ బంధం చాలా గౌరవప్రదమైనది, తోబుట్టువులు ఒకరికొకరు కలిగి ఉన్న ప్రేమ, నమ్మకానికి ప్రతీక. ప్రియమైనవారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న వేళ, మంచి ఆరోగ్యం కోసం కొన్ని బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం కంటే మెరుగైన మార్గం ఈ రక్షా బంధన్‌ వేళ మరొకటి లేదు. ప్రతి సందర్భం శుభారంభం కోసం పిలుపునిస్తుంది.

ఈ పండుగను ప్రారంభించడానికి బాదం సరైన మార్గం. ఆరోగ్యం, పోషకాహారం యొక్క మంచితనంతో నిండిన బాదంలో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం, బాదం. ఒక వ్యక్తిని చాలా కాలం పాటు శక్తివంతంగా మరియు సంతృప్తిగా ఉంచగలవు. గుండె ఆరోగ్యానికి, మధుమేహానికి, బరువు నిర్వహణకు, చర్మ ఆరోగ్యానికి రోజుకు కొన్ని బాదంపప్పులు తినటం మేలు చేస్తాయి. బాదంపప్పు అందించే అన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఈ రక్షా బంధన్ సందర్భంగా అవి మన తోబుట్టువులకు సరైన బహుమతి ఎంపికను అందిస్తాయి.

ఈ పండుగ సందర్భంగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, “రక్షాబంధన్ అనేది అందరికీ ఆనందం, ఉత్సాహాన్ని కలిగించే పండుగ, తోబుట్టువుల మధ్య అనేక భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. బాదంపప్పులు మన అన్ని వేడుకలలో, ముఖ్యంగా రక్షా బంధన్‌లో భాగం. అవి ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి. నా కుటుంబానికి ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులు ఉండేలా చూసుకుంటాను” అని అన్నారు.

MBBS & పోషకాహార నిపుణులు, డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ…“బాదంపప్పులు అందించనంతగా ఏ బహుమతి కూడా ‘కేర్’ని అందించదు. ఆరోగ్యం అనేది మనం తప్పక మెచ్చుకోవాల్సిన విలువైన ఆస్తి అని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పులు ఇనుముకు మూలం, ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి దోహదపడే ఒక పోషకం” అని అన్నారు

రీజినల్ హెడ్-డైటెటిక్స్, మాక్స్ హెల్త్‌కేర్-ఢిల్లీ, రితికా సమద్దర్ మాట్లాడుతూ… “బాదం, ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో సహాయపడే విటమిన్ B2, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. కాబట్టి, రక్షా బంధన్ సందర్భంగా బాదంపప్పును బహుమతిగా ఇవ్వడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి” అని అన్నారు.

న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… “మనలో చాలా మంది మన తోబుట్టువులకు రాఖీ కట్టే ముందు ఉపవాసం ఉండే ఆచారాన్ని పాటిస్తారు, వేడుక తర్వాత బాదం తినడం వల్ల మంచి కొవ్వులు ఉంటాయి కాబట్టి శక్తి లభిస్తుంది. ఈ రక్షా బంధన్, వారి కోసం, వారి కుటుంబాల కోసం బుద్ధిపూర్వకమైన ఎంపికలు చేయాలని నేను ప్రజలను కోరుతున్నాను!” అని అన్నారు. సెలబ్రిటీ పిలేట్స్ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి సారిస్తూ, తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవడం, చురుకుగా ఉండడం ముఖ్యం. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది!” అని అన్నారు

స్కిన్ ఎక్స్‌పర్ట్, కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ, “సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా ఇవ్వడానికి బాదం గొప్ప బహుమతి. బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపు లభిస్తుంది. ఈ రక్షా బంధన్, బాదంపప్పు బహుమతి మీ బంధానికి నిదర్శనం, అందం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఉండనివ్వండి” అని అన్నారు. ఆయుర్వేద నిపుణురాలు, డాక్టర్ మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ, “రక్షాబంధన్ అనేది ప్రేమ, సంరక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బహుమతి విషయానికి వస్తే, బాదంపప్పులు ఒక అద్భుతమైన ఎంపిక. ఎందుకంటే ఇవి చర్మ ఆరోగ్యానికి మంచివి, చర్మ కాంతిని పెంచుతాయి” అని అన్నారు. నటి ప్రణీత సుభాష్ మాట్లాడుతూ, “రోజువారీ ప్రాక్టీస్‌గా, ఆహారంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే వస్తువులను చేర్చుకోవాలని నేను సూచిస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News