Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు రాఖీ క‌ట్టిన అక్కాచెల్లెళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News