Monday, December 23, 2024

రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. “రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. అన్నా చెల్లెళ్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా రాఖీ జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. సైనికుల గురించి పిల్లలు తెలుసుకోవాలి” అని పేర్కొన్నారు. రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో విద్యార్థులు, ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News