మన తెలంగాణ/సిటీ బ్యూరో: సోదర, సోదరీమణుల ప్రేమా అనురాగాల అపురూప బంధాలకు ప్రతీక రాకీ పండుగ…. అక్కా చెల్లెళ్ళతమ అనురాగ ఆప్యాయతలనే దారాలుగా పెనవేసి, అను బంధ మనే బాంధవ్యాలనే రక్షను గట్టిగా ముడివేసి రాకీగా మలిచి శ్రావణ పౌర్ణమి రోజున అన్నాదమ్ముల కలకలం సుఖ సంతోషాలు, ఆయుఆరోగ్యాలతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చేతి కట్టే మహోత్తరమైన పండుగ రక్షా బంధన్. ప్రపంచంలోనే చాల విశిష్టమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న రాఖీ పండుగ శుక్రవారం జరగనుంది. తోబుట్టువులతో పాటు తమ సోదర సమానులుగా భావించే వారితో మానవీయ సంబంధాలను మరింత పట్టిష్టం చేస్తూ సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలి చే రాకీ పండుగకు అక్కాచెళ్లలు.అంతా సిద్దంచేసు కుంటున్నారు.
ప్రస్తుత హైటెక్ యుగంలో విలాసాలకు అలవాటు పడడంతో ధనమై ప్రధానమై. మానవత్వ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కూడా కేవలం అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లకే ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధన్ పరిమితం కాకుండా కుల మతాలకు అతీతంగా సోదరులుగా భావించే ప్రతి ఒక్కరి చేతికి ఆడపడుచు రాఖీని కడుతూ ప్రేమఅనురాగాలకు ప్రతీక నిలుస్తోన్న ఏకైక పండుగ రక్షా బంధన్….సోదరి సోదరుల మధ్య ఎన్ని మనస్పర్థాలున్నా వాటిని పక్కన పెట్టి తన అన్నదమ్ములకు రక్షణ కవచంగా రాకీ కట్టటం ఈ పండుగ ప్రత్యేకత. అయితే స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళా రాఖీ పండుగ రావడంతో ఈ ఏడాది దేశ భక్తి జాతీయ భావాన్ని చాటేలా రాఖీలను సిద్దం చేసుకుంటున్నారు.
హైటెక్ రాఖీలు, పెరిగిన ధరలు
హైటెక్ యుగంలో రాకీ పండుగ సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో చిన్న దూదితో ముడివేసిన దారాలను రక్షా బంధాలను కట్టెవారు .అయితే అందించిన సాంకేతిక విజ్ఞానంతో రాఖీలు సైతం విభిన్న రూపాల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే గతంలో పేదవారికి అందుబాటులో ఉన్న రాఖీల ధరలు నేడు మాత్రం కొండేక్కి కూర్చున్నాయి. దీంతో పేదలు నాటి దూదితో మూడివేసిన రక్షా బంధాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. జిఎస్‌టి పుణ్యమా అన్ని రాఖీల ధరలు సైతం విపరితంగా పెరిగాయి.గత ఏడాది సాధారణ రాఖీలు రూ. 5ల నుంచి రూ.100లోపు ధరల్లో ఉండగా ఏడాది మాత్రం వాటి ధరలు రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా రాళ్లు, ముత్యాలు పొందింగిన రాఖీలు రూ.100 మొదల్కొన్ని రూ, 1000ల వరకు అందుబాటు ఉండగా ఈ ఏడాది వీటి ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. ధరలతో కొంత ఇబ్బంది పడ్డా తమ సోదరుల మీద ఉన్న ప్రేమతో సామాన్య ఆడబిడ్డలు మాత్రం తమ తమ తహాత్తుకు తగ్గ రాఖీలు కొనుగోలు చేస్తు సర్దుకుంటున్నారు. శ్రీమంతులైన అడపడుచులు మాత్రం వెండి, బంగారుతో చేయించిన రాఖీలను తమ అన్నాదమ్ముళ్లకు కడుతూ తమతమ ప్రేమానురాగాలను చాటుకుంటున్నారు.
నగరంలో రాఖీల సందడి- స్వీట్లకు భలే గిరాకీ
రక్షా బంధన్ సందర్భంగా ఆడపడుచులతో గురువారం ప్రధాన మార్కెట్లన్ని కిటకిటలాడాయి.రాఖీలతో పాటు స్వీట్లకు భలే గిరాకీ ఏర్పడింది. రాకీ పండుగ గీరాకీని దృష్టిలో పెట్టుకుని అన్ని మిఠాయి దుకాణదార్లు విభిన్న రకాల స్వీట్లను తయారు చేసి వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడగా ఆ స్వీట్ ఈ స్వీట్ అన్నకుండా షాపులన్ని ఖాళీ అవుతుండడంతో స్వీట్ షాపుల యాజమనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొంతమంది యజమానులు మాత్రం పండుగను ఆసరా చేసుకున్ని ధరల పెంచి దోచుకునే పనిలో పడ్డారు.