జల్‌గావ్: కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు తప్పలేదు. తన కుమార్తెను కొందరు వేధించారంటూ.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లోని ఆమె కుమార్తెని వేధించడమే కాక.. భద్రతా సిబ్బందితో కూడా పోకిరిలు దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
‘మహాశివరాత్రికి జరిగే సంత్ ముక్తాయ్‌కి తన స్నేహితులతో కలిసి వెళ్తానని నా కుమార్తె సెక్యూరిటీతో వెళ్లింది. అక్కడ తనను కొందరు యువకులు వెంబడించి వేధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. నేను గుజరాత్ పర్యటన నుంచి రాగానే నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎంపి లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి’ అని రక్షా అన్నారు.
అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందిన వారని.. వారిలో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. నిందితులకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.