Wednesday, January 22, 2025

అనురాగం, అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ ప్రేమానురాగాలను పంచడమే రక్షా బంధన్ ఉద్దేశమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకుని బుధవారం నాగర్‌కర్నూల్ శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికి రాఖీ కట్టి ప్రేమను పంచుకున్నారు.

అనురాగం, ఆప్యాయత, అనుబంధాలను పంచేదే రాఖీ పండుగ అని కలెక్టర్ అభివర్ణించారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐక్యమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుంటారని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో విద్యలో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగే రాఖీ అని, దేశ సంస్కృతి సాంప్రదాయాలో ఇది గొప్ప ఆచారమని, ప్రజల మధ్య సోదరభావం మరింతగా విరిసిల్లాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకాంక్షించారు. శిశు మందిర్ విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News