Sunday, April 6, 2025

అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సోదరీమణులు కల్వకుంట్ల కవిత, జోగినపల్లి సౌమ్యలు తమ సోదరుడు సంతోష్‌కు రాఖీలు కట్టి రాఖీ కట్టి ఆశీర్వదించారు. తన సోదరీమణులు రాఖీని కట్టేటప్పుడు వారితో ఉన్న బంధాన్ని ఎంతో ఆదరిస్తున్నానని ఎంపి సంతోష్ అన్నారు. జీవితాన్ని అందంగా మార్చే శాశ్వత కనెక్షన్‌లకు రాఖీ పండుగ ఉపయుక్తం కానుందని వెల్లడించారు.

Santhosh Kumar2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News