Monday, December 23, 2024

“రాక్షస కావ్యం” సినిమా టీజర్ లాంఛ్

- Advertisement -
- Advertisement -

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. Excutive Producer Umesh Chikku, నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం”  చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. గురువారం “రాక్షస కావ్యం” సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బలగం దర్శకుడు వేణు యెల్దండి, యంగ్ హీరో తిరువీర్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

నిర్మాత దాము రెడ్డి మాట్లాడుతూ – మా సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు వేణు, హీరో  తిరువీర్ కు థాంక్స్ చెబుతున్నా. “రాక్షస కావ్యం” తో ఒక భిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఒక కొత్త తరహా సినిమా నిర్మించాం. మా మూవీ ఒక డార్క్ కామెడీలా అనిపించవచ్చు. కానీ మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ మీకు పరిచయం ఉన్నట్లు, కథ మన చుట్టూ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవాళ కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాం. అన్నారు.

సంగీత దర్శకుడు రాజీవ్ రాజ్ మాట్లాడుతూ – ఈ సినిమాకు సంగీత దర్శకత్వం చేసే అవకాశం రావడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. మేము చేయగలమా అని అనుకున్నాం. కానీ మాపై  మాకంటే మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నమ్మకం ఉండేది. వారు నమ్మినట్లు మంచి మ్యూజిక్ చేశామని అనుకుంటున్నా. ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంటుంది. వాళ్లు  తమ క్యారెక్టర్స్ లో జీవించారు. అని అన్నారు.

హీరోయిన్ కుశాలిని మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ దాము, డైరెక్టర్ శ్రీమాన్ గారికి థాంక్స్. ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ రోహిణి మాట్లాడుతూ – ఈ సినిమా ఆడిషన్ చేసినప్పుడు నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది. సినిమాకు సెలెక్ట్ అయ్యాక చాలా హ్యాపీగా  వర్క్ చేశాం. “రాక్షస కావ్యం” మూవీ ఆకట్టుకునేలా ఉంటుంది. మమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు గ్రేట్ ఫీలింగ్ కలిగింది. అని చెప్పింది.

నటుడు  పవన్ రమేష్ మాట్లాడుతూ – దాము గారు ప్రొడ్యూస్ చేసే ప్రతి సినిమాలో నాకు అవకాశం కల్పిస్తారు. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం టైమ్ నుంచి శ్రీమాన్ తెలుసు. ఆయన అప్పుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసేవారు. ఈ సినిమాలో తిరువీర్ చేయాల్సిన క్యారెక్టర్ లో నేను నటించాను. ఆయన బిజీ అయ్యి డేట్స్ కుదరలేదు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అన్నారు.

నటుడు అన్వేష్ మైఖేల్ మాట్లాడుతూ – నేను గతంలో కొత్త పోరడు అనే వెబ్ సిరీస్ చేశాను. ఈ కథ విన్నాక ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఆ ఎగ్జైట్ మెంట్ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపూ ఉంది. ఇదొక కల్ట్ మూవీ అవుతుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అంత బాగుంటాయి. అని అన్నారు.

నటుడు యాదమ్మ రాజు మాట్లాడుతూ – నేను ఈటీవీలో పటాస్ చేస్తున్నప్పుడు దాము అన్న పిలిచి గువ్వ గోరింక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన చేసే ప్రతి సినిమాలో నేనుంటాను. దాము అన్నకు థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా అదిరిపోతుంది. అన్నారు.

హీరో నవీన్ బేతిగంటి మాట్లాడుతూ – నేను రామన్న యూత్ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కదా యాక్టింగ్ చేయవేమో అనుకున్నాం అని ఆఫర్స్ ఇవ్వడం మానేశారు. నేను బేసిక్ గా యాక్టర్ ను, సినిమాల్లో నటించాలని కోరుకుంటా. దాము అన్న ద్వారా శ్రీమాన్ వచ్చి ఈ కథ చెప్పాడు. ఈ కథలో నేను ఏ క్యారెక్టర్ కోరుకున్నానో, అదే క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నా లైఫ్  టైమ్ లో గుర్తుండే సినిమా అవుతుంది. “రాక్షస కావ్యం” ఒక డిఫరెంట్ మూవీ. సినిమా చూశాక మీరే చెబుతారు. శ్రీమాన్ లాంటి ప్యాషనేట్ డైెరెక్టర్ ను మనమంతా సపోర్ట్ చేయాలి. టీజర్ ఎంత బాగుందో సినిమా  కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అని అన్నారు.

దర్శకుడు శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ – మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ రాసుకున్న కథతో “రాక్షస కావ్యం” సినిమాను తెరకెక్కించాను. ఈ కథను 30, 40 మంది ప్రొడ్యూసర్స్ కు చెప్పా. వాళ్లు డేర్ చేయలేకపోయారు. కానీ దాము గారు కథ విని సినిమా చేద్దామని ముందుకొచ్చారు. పురాణాల్లోని జయ విజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనే ఫిక్షనల్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. సినిమాను కూడా ఇష్టపడతారు. అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాను ఎంతగా నమ్మి ఉంటే ఈ టీమ్ అంతా ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ప్రొడ్యూసర్ దాము గారితో సహా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్లను ఒప్పించి సినిమా చేయించడమే పెద్ద టాస్క్. ఈ టీమ్ లో చాలా కష్టపడే వారున్నారు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

బలగం దర్శకుడు వేణు మాట్లాడుతూ – కొత్తగా ఏదైనా సినిమా చేయాలనే తపన ఉన్న టీమ్ అంతా కలిసి “రాక్షస కావ్యం” చేశారు. ప్యారలల్ సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్న బ్యాచ్ వీళ్లు. టీజర్ చూశాను చాలా బాగుంది. ఎదో కొత్తదనం సినిమాలో ఉండబోతోంది అని అర్థమైంది. మీకూ టీజర్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ప్యాషనేట్ టీమ్ ను ఎంకరేజ్ చేయండి. దాము,అన్న శ్రీమాన్, నవీన్, అన్వేష్, యాదమ్మ రాజు..ఇలా అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్వేష్ కొత్త పోరడు వెబ్ సిరీస్ నన్ను ఇన్ స్పైర్ చేసింది. “రాక్షస కావ్యం” హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – ఒక చిన్న జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన నా మిత్రుడు దాము ప్రొడ్యూసర్ గా ఎప్పటికీ గుర్తుండే సినిమాలు చేస్తున్నారు. జార్జ్ రెడ్డి తర్వాత “రాక్షస కావ్యం” ఆయన సంస్థలో మెమొరబుల్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. సినిమా చూశాను. నిజంగా ఇదొక వైవిధ్యమైన చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News